భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వనపర్తి జిల్లాలో తక్షణమే స్థానిక సంస్థల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి )అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం ఐ.డి.ఒ.సి సమావేశ మందిరమంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం షెడ్యూల్ ప్రకటించడం జరిగిందని అందువల్ల…