భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పోతిరెడ్డిపల్లి మాజీ ఉపసర్పంచ్, మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు సుమారు వెయ్యిమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు.