భారత్ సమాచార్, జగిత్యాల జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు. కోరుట్ల మండలం మాదాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. 8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్కు చెందిన వైష్ణవి (19) ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్లోనే నివాసముంటున్నారు. హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైష్ణవి రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తోంది. గత…