భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈనెల 18-19వ తేదీలలో అంతరిక్షశాస్త్రం, రక్షణ సాంకేతికతలో పురోగతి అనే అంశంపై రెండురోజుల జాతీయ చర్చాగోష్ఠిని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు (కన్వీనర్) ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ శుక్రవారం వెల్లడించారు. అంతరిక్షశాస్త్రం, రక్షణ సాంకేతిక పరిజ్జానాలలో ఉద్భవిస్తున్న ధోరణులు, ఆవిష్కణలు, సహకార అవకాశాలను చర్చించడానికి నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలను ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రొఫెసర్ ప్రీతి వివరించారు.
ఐఐటీ హైదరాబాదులోని డీఆర్డీవో-పరిశ్రమ-విద్యా సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్…





