భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు ఎక్స్‌రోడ్ నుంచి పటేల్‌గూడ వైపు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో అటు నుంచే వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానికులే నడుం బిగించారు. పటేల్‌గూడ గ్రామ పెద్దలు భవాని దేవదాస్, కామండ్ల కృష్ణ స్వచ్ఛందంగా ముందుకొచ్చి గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు. ప్రభుత్వం స్పందించి శాశ్వత ప్రాతిపదికన రహదారిని నిర్మించాలని వారు కోరారు. వారి చొరవను వాహనదారులు,…