భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: రుణం పూర్తిగా చెల్లించినా, ఆన్‌లైన్‌లో ఇంకా బాకీ ఉన్నట్లు చూపిస్తుండటంతో ఓ రైతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాచారం మండలం ధర్మన్నగూడకు చెందిన బండ చెన్నయ్య తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తీసుకున్న అప్పును క్లియర్ చేశారు. అయితే, ఇతర బ్యాంకుల్లో రుణం కోసం వెళ్లగాలోన్ ఇంకా ‘క్లోజ్’ కాలేదని చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య తలెత్తిందని, తక్షణమే రికార్డులు సరిచేసి తనకు న్యాయం చేయాలని సదరు రైతు డిమాండ్ చేశారు.