భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: పత్తి పంట కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటల కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పత్తి కొనుగోలు ప్రక్రియను నిర్ణీత సమయానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కొనుగోళ్లకు సంబంధించి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ కోసం ‘కపాస్ కిసాన్ యాప్’ వినియోగించాలని తెలిపారు. రైతులకు…