భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. సోమవారం ఉదయం 5 గంటలకు తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు 30 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఉదయం 7.05 గంటల సమయంలో చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్‌.. బస్సును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాయంలో బస్సులో 70 మంది…