భారత్ సమాచార్.నెట్, ములుగు : చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జర్నలిస్ట్ హక్కుల కోసం కృషి చేసిన కొండా లక్ష్మారెడ్డి (85) ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకు హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన లక్ష్మారెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు.
ఏపీసీసీ ప్రతినిధిగా, క్రీడా మండలి ఛైర్మన్‌గా పలు పదవులను నిర్వహించారు. రాజకీయాలతో…





