భారత్ సమాచార్.నెట్, నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో TUFIDC ద్వారా మంజూరైన రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
జామ చెట్ల బావి నుంచి కొండాపురం వరకు బీటీ రోడ్డు, అలాగే మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి…





