భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ – సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపు అడ్డంగా బోర్డులు పెట్టడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం, మండల విద్యాధికారి స్పందించకపోవడం గమనార్హం. అధికారులు తక్షణమే స్పందించి ఆ బోర్డులను తొలగించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.






