భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. హత్నూర మండలంలోని హత్నూర, కోన్యాల్, మధుర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, సుమారు 50 మంది కార్యకర్తలు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా జట్టు భావనతో పనిచేసి కాంగ్రెస్ బలాన్ని మరింత…





