భారత్ సమాచార్, సిద్దిపేట: హుస్నాబాద్ కోర్టు ఎదుట శుక్రవారం న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్, ఇతర న్యాయవాదులపై జరిగిన దాడిని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. మాజీ ఏజీపీ కన్నోజు రామకృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే పోలీసులు ఆయనను అక్రమంగా…