భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలోని మహిళా ప్రాంగణంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ చిన్నారుల దత్తత వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూవో లలిత కుమారి మాట్లాడుతూ.. చట్టబద్ధంగా చిన్నారుల దత్తత తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అంతర్జాతీయ దత్తత విధివిధానాలను వివరించారు. ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో శిశు గృహ మేనేజర్ మొగులయ్య, సీడబ్ల్యూసీ సభ్యులు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.