భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నేటి తరం విద్యార్థులు అర్థవంతమైన లక్ష్యాలను సాధించాలని, సమాజానికి సృజనాత్మకంగా దోహదపడాలని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లోని రాజకీయ అధ్యయనాల కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ రాజకీయ సిద్ధాంతకర్త, విశ్లేషకుడు డాక్టర్ అజయ్ గుడవర్తి సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని రాజకీయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘జెన్ జీ (నేటి యువత) – భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు’ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.…