భారత్ సమాచార్.నెట్, మెదక్ : సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని గాడియమ్ స్కూల్‌లో జనవరి 19 నుండి 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా విద్యార్థులు, ఉపాధ్యాయులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపిన వివరాల ప్రకారం.. కొడపాక జెడ్పీహెచ్ఎస్ భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటరమణ ‘టీచర్ ఎగ్జిబిట్’ విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి తృతీయ స్థానం, సిద్ధార్థ రూరల్ హై స్కూల్ విద్యార్థి…