భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఎన్నికల నియమావళి అమలుకు, పరిపాలన కార్యకలాపాలకు సహకరించాలని కలెక్టర్ కోరారు.