భారత్ సమాచార్ నెట్, సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ‘జిఎంఆర్ (GMR) ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్’ పోటీలకు సర్వం సిద్ధమైందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నేటి తరం యువతలో వ్యాయామం పట్ల అవగాహన కల్పించేందుకు, వారిని క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ భారీ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
పటాన్చెరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ…





