భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో గల వికాస్ ఓకేషనల్ జూనియర్ కాలేజీకి DIEO నోటీసులు జారీ చేసింది.కాలేజీకి ఎటువంటి అనుమతులు లేవంటూ DIEO గోవింద్ రామ్ నోటీసులు జారీ చేసారు. విద్యార్థులెవరు వికాస్ ఓకేషనల్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవద్దని ప్రకటన విడుదల చేసారు. ఇప్పటికే కాలేజీలో 100 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. DIEO ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం కళాశాలకు తాళం వేసి వెళ్లిపోయారు.
మరిన్ని కథనాలు:





