భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 1:00గంట వరకు నిర్వహించిన ఎలక్షన్ పోలింగ్ శాతం ఇలా ఉన్నాయి. డోర్నకల్ 89.79%, గంగారం 84.83%, కొత్తగూడ 83.01%, కురవి 86.78%, మరిపెడ 86.20%, సిరోలు 89.60% నమోదైనట్లు ఆయా మండలాల ఎలక్షన్ అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో పలుగ్రామాల్లో జరుగుతున్న మూడవవిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పరిశీలించారు.