భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: ధర స్థిరత్వం ప్రధానంగా కేంద్ర బ్యాంకుల బాధ్యత అని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన ‘కేంద్ర బ్యాంకుల ఆర్థిక విధి’, ‘సమస్యలను పరిష్కరించడం.. కేంద్ర బ్యాంకింగ్ భవిష్యత్తు’ అనే అంశాలపై మాట్లాడారు.
ద్రవ్యోల్బణం పేదలపై అతి పెద్ద పన్నుగా అభివర్ణించిన డాక్టర్ సుబ్బారావు.. తక్కువ, స్థిరమైన ద్రవ్యోల్బణాన్ని కొనసాగించడం ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని వివరించారు. ద్రవ్యోల్బణ అంచనాలు స్వీయ-సంతృప్తిగా మారగలవు…





