భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: సీనియర్ జర్నలిస్ట్ గిరి ప్రసాద్ ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం స్థానిక జర్నలిస్టు వర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సంస్మరణ సభ నిర్వహించారు.

ఈ సభకు డీఎస్పీ ప్రభాకర్, సీఐ వినాయక రెడ్డిలతో పాటు ముఖ్య అతిథిగా ప్రిథ్వీరాజ్ హాజరయ్యారు. గిరి ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. నిజాలను వెలుగులోకి తేవడంలో ఆయన చూపిన ధైర్యం, సత్యనిష్ఠ…