భార‌త్ స‌మాచార్‌.నెట్, నిర్మల్: జిల్లాలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన స్థానాల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ శనివారం కలెక్టరేట్‌లో పూర్తయింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించి, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వాటాలను నిర్ణయించారు. మొత్తం ప్రక్రియ వీడియో రికార్డింగ్ మధ్యన, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల…