భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా హత్నూర మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. అధికారులతో మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, సిబ్బంది అధికారులు అప్రాతంగా ఉండాలని సూచించారు.