భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ పట్టణంలోని గట్టగూడెం శ్రీ భక్తాంజనేయ స్వామి పంచముఖ శివాలయం నందు కార్తీక మాసం సందర్భంగా మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణు అయ్యగారు ఆధ్వర్యంలో శివ భగవానుడికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. పూలమాలలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:





