భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శ్రీధర్ రెడ్డి తుమ్మల డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక కారకాలుగా పనిచేసే ట్రయాజోల్స్, టెట్రాజోల్స్, పైరజోల్స్ తో సహా అజోల్ హైబ్రిడ్ ల కోసం ఒక కొత్త సంశ్లేషణ పద్ధతి’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ కొప్పుల శనివారం విడుదల…