భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: విద్యాపరమైన ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా గోల్కొండ, బోయిన్‌పల్లి కేంద్రీయ విద్యాలయం, సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ జూనియర్ బాలికల కళాశాల విద్యార్థులు హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ను సందర్శించారు. ఓపెన్ హౌస్‌లో భాగంగా సందర్శించడానికి వచ్చిన 11, 12వ తరగతి విద్యార్థులకు ముఖాముఖి ప్రదర్శనల ద్వారా నిర్మాణ అభ్యాసంపై సృజనాత్మక, లోతైన అవగాహనను కల్పించారు. గీతం ఆర్కిటెక్చర్ అధ్యాపకులు, విద్యార్థులతో వారు మాట్లాడి స్టూడియో సంస్కృతి, డిజైన్ ప్రక్రియలు, సృజనాత్మక సమస్య పరిష్కారంపై విలువైన సమాచారాన్ని…