భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాలలో గెలుపొందిన కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి కొలువుదీరారు. ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్వతమ్మగూడెం సర్పంచ్ ఎదెల్ల పూలమ్మ, నెల్లికుదురు పులి వెంకన్న, బ్రాహ్మణ కొత్తపల్లి చిర్ర యాకాంతం గౌడ్, హనుమాన్ నగర్ తండ(తారా సింగ్ బావి) భూక్య అశోక్, ఎర్రబెల్లి గూడెం గుండెబోయిన ఉష,పెద్ద తండా బాధావతు సుధారాణి, సౌల్ల తండా…