భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీ నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనులు, ఇతర ముఖ్యమైన అధికారిక కార్యకలాపాలలో జిల్లా స్థాయి అధికారులు నిమగ్నమై ఉన్న నేపథ్యంలో, ఈ నెల 12న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు.ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.