భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటంలో, ఔషధాలపై సరైన అవగాహన కల్పించడంలో ఫార్మసిస్ట్‌ల పాత్ర కీలకమని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు అన్నారు. నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే (మార్చి 6)ను పురస్కరించుకుని.. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఎన్ఎస్ఎస్ యూనిట్,…