భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్-కె గ్రామానికి చెందిన జనగామ స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎస్సీ/ఎస్టీ (SC/ST) అట్రాసిటీ కేసు దర్యాప్తు పురోగతిని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేసు విచారణలో భాగంగా బుధవారం ఆయన వెంకటాపూర్-కె గ్రామంలోని సంఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, స్థానిక సాక్షులను విచారించి వివరాలు సేకరించారు.
గ్రామ పర్యటన అనంతరం నిజాంపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన డీఎస్పీ నరేందర్ గౌడ్.. కేసుకు…





