భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట్ లో అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్న సంఘటన పుల్కల్ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని బిజిలిపూర్ గ్రామా నికి చెందిన లక్ష్మి (26) ని 20 నెలల క్రితం పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన పట్నం ప్రవీణ్ తో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ. 9 లక్షల నగదు, బంగారం,…