భారత్ సమాచార్, పెద్దపల్లి జిల్లా: గోదావరిఖనిలోని సింగరేణి సూపర్ బజార్‌కు నూతన డివిజనల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన వరిపల్లి అజయ్‌కు శుక్రవారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా, కేంద్ర, బ్రాంచి నాయకులు అజయ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని, సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.
సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సూపర్ బజార్ ఉద్యోగులు, వినియోగదారుల…





