భారత్ సమాచార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా విజయసింహారెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసి మండలంలో జరిగే పలు విషయాలపై చర్చించారు. ఎస్సైకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఎంతటి వారికైనా చట్టపరమైన శిక్షలు తప్పవని అన్నారు.
మరిన్ని కథనాలు:





