భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పార్టీ బలోపేతానికి ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అని నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ వార్డు సభ్యులు పేర్కొన్నారు. శనివారం గుమ్మడిదల మండల కేంద్రంలోని సీజీఆర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని కానుకుంట బీఆర్ఎస్ వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా ఘనంగా సన్మానించారు.
పార్టీ అభ్యర్థులు, నాయకులకు నిరంతరం అండగా నిలబడి, కార్యకర్తలకు ప్రోత్సాహం అందిస్తున్న నాయకుడిగా సీజీఆర్ గుర్తింపు పొందుతున్నారని సభ్యులు కొనియాడారు. పార్టీ బలోపేతంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్టు…





