భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సాయి గణేష్ కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి దేవాలయాల భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నూతన దేవాలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తా: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




