భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. మీనాజిపేట గ్రామానికి చెందిన నాగరాజు మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ప్రతీరోజూ మద్యానికి బానిసై తల్లిని వేధిస్తున్నాడు. రూ.5వేలు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై దాడి చేసి అనంతరం మనస్తాపంతో నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.