భారత్ సమాచార్, జాతీయం : దీపావళి పండుగ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ చిన్నారి తన మధురమైన భజన్తో ప్రత్యేక ఆనందాన్ని పంచింది. ఆ చిన్నారి పాటను ఆసక్తిగా విన్న ప్రధాని చిరునవ్వుతో అభినందించారు. భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో మోదీ జరిపిన సమావేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి పాటకు ప్రధాని స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
నవంబర్ 6న న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, ఆయన…





