భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రసాయన ఎరువులు, పెస్టిసైడ్స్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో పంటలు సాగు చేయడంపై రైతులకు అవగాహన కల్పించారు. వేసంగి (రబీ) సీజన్‌లో ప్రకృతి వ్యవసాయం చేపట్టే సమయంలో పాటించాల్సిన మెలకువలు, యాజమాన్య పద్ధతులపై మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని ఆలేరు రైతు వేదికలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికైన మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన 125 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…