భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచి చెడుపాక సుజాత యాకయ్యతో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో రహదారి భద్రతను మెరుగుపరచడంతోపాటు రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మండల కేంద్రం ఇనుగుర్తికి శనివారం ఎమ్మెల్యే మురళి నాయక్ రావడంతో సర్పంచి, గ్రామ నాయకులు ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం చేపట్టిన…