భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లాకు చెందిన పీసీఆర్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై ఏ.రామకృష్ణ శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్సై రామకృష్ణను శాలువ, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సుధీర్ఘకాలం పోలీసుశాఖలో విధులు నిర్వహించి ప్రజల భద్రత కోసం అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత ఇతర పోలీసు సిబ్బందికి ఆదర్శంగా…