భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ఆత్మకూర్ డిఎఫ్ఓ కార్యాలయంలో డిఎఫ్ఓ విఘ్నేష్ అప్పారావుకు కొమురం భీం ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై.ఆశీర్వాదం వినతిపత్రం అందజేశారు. శ్రీశైలం రేంజ్ పరిధిలో హటకేశ్వరం, శిఖరం ప్రాంతాల్లో నిర్మించిన టాయిలెట్–బాత్రూంలు ప్రారంభించకపోవడంతో భక్తులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శివరాత్రి, ఉగాది పండుగల సమయంలో వేలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో సమస్య మరింత తీవ్రంగా మారుతోందన్నారు. తక్షణమే బాత్రూంలు ప్రారంభించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. డిఎఫ్ఓ…