భార‌త్ స‌మాచార్.నెట్, నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం యాచారం గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బుర్రి సందీప్ అసాధారణ ప్రతిభను చాటారు. ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాలలో 538 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచిన సందీప్‌ను ఏకే (A.K) ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ శనివారం ఘనంగా సన్మానించారు. యాచారం గ్రామానికి స్వయంగా విచ్చేసిన అనిల్ కుమార్.. విద్యార్థిని అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రోత్సాహకంగా నగదు పారితోషికాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా…