భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: పత్తికొండ మండల పరిధిలోని పెండ్లిమాన్ తండాలో సేవాలాల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రైతులకు వేరుశెనగ పంటపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి పాల్గొని, వేరుశెనగ పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, విత్తన ఎంపిక, విత్తే సమయం, ఎరువుల వినియోగం, తెగుళ్ల నివారణ చర్యలపై రైతులకు సవివరంగా వివరించారు. ఆధునిక సాగు పద్ధతులు అనుసరిస్తే ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయని సూచించారు. కార్యక్రమంలో సంఘం…