భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లాలో రెండవ విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ‘సైలెన్స్ పీరియడ్’ అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీ.ప్రావీణ్య తెలిపారు. రెండవ విడత ఎన్నికలు జరుగనున్న ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కొహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో 12వ తేదీ సాయంత్రం 5:00 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం…