భారత్ సమాచార్, విజయనగరం జిల్లా: మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సాఆర్ సీపీ నాయకులు కోటి సంత‌కాలతో ర్యాలీలు నిర్వహించారు. దీనిలో భాగంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా…