భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీలు కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మెండోరా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెండోరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత రెండేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కోర్టు తీర్పుతో తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చే సుమారు రూ. 94 వేల…





