భారత్ సమాచార్.నెట్, నిర్మల్: జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలులోకి రావడంతో పరిపాలనా కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కీలక ప్రకటన చేశారు. ఎంసీసీ దృష్ట్యా, సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఆ తర్వాత తిరిగి యథావిధిగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని కథనాలు





