భారత్ సమాచార్.నెట్, ప్రకాశం: పెద్దచెర్లోపల్లి మండలం మురిగమ్మి గ్రామంలో  బుధవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రుణాలు పొందిన రైతులతో మండల పార్టీ అధ్యక్షులు వేమూరు రామయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా బి.సి. సెల్ అధ్యక్షులు నంది కానమ బ్రహ్మయ్య ముఖ్య అతిథిగా విచ్చేయగా, ఒంగోలు పార్లమెంట్ బి.సి. సెల్ కార్యదర్శి కోమటికుంట్ల వీరయ్య పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీటీసీ పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, సిరిపిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి…