భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: పటాన్‌చెరు పరిధిలోని శ్రీనగర్ కాలనీలో జరుగుతున్న కల్తీ అల్లం పేస్ట్ దందాను పోలీసులు రట్టు చేశారు. శేర్ లింగంపల్లి ఎస్ఓటీ, పటాన్‌చెరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో కల్తీ నిల్వలను పట్టుకున్నారు. ఈ సోదాల్లో 535 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు, సుమారు 900 కేజీల అల్లం పొట్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు మురిగిపోయిన అల్లం, ఎల్లిపాయ పొట్టు, ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగించి ఈ కల్తీ అల్లం పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు…





